బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస

బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులో ఈ నెల 17న తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు రానున్న నేపథ్యంలో పలు చోట్ల దాడులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం రాజధాని ఢాకాలో, తీర్పును వెలువరించే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది.