ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్
NRPT: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు శ్రీను, ఫణీంద్ర రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. సాధారణ తనిఖీలలో భాగంగా గోదాం సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రత సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తహశీల్దార్ అమరేంద్ర కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.