VIDEO: అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: జిల్లా కేంద్రంలోని అగ్రో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ సంతోష్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవా కేంద్రంలో సేల్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం దుకాణం యాజమానికి సూచనలు చేశారు. రైతులకు పంటను బట్టి యూరియా ఇవ్వాలని, ఈ పాస్ యంత్రంలో నమోదు చేయాలని ఆదేశించారు. యూరియాను వ్యవసాయానికి మాత్రమే వాడాలని, పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.