గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

NRML: బాసర ఆలయం నుండి గోదావరి వెళ్లే మూలమలుపు వద్ద దీక్ష లాడ్జి పక్కన కాలువలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంమైంది. మృతుడు నీలిరంగు గీతల షర్టు, నీలిరంగు లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI గణేష్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉందని ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.