'నరసింహారెడ్డి గారి ఆదర్శలతో యువత ముందుకు పోవాలి'
STPT: తుంగతుర్తిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మల్లు వెంకట నరసింహారెడ్డి ఆదర్శంతో నేటి యువత ముందుకు పోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. శుక్రవారం మండలంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో CPI(M) నాయకులు పాల్గొన్నారు.