ఆండ్రాయిడ్ ఫోన్లపై నిషేధం
దేశ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక అధికారులు ఆండ్రాయిడ్ ఫోన్లను వాడకుండా పూర్తిగా నిషేధించింది. అధికారిక కమ్యూనికేషన్ల కోసం ఉన్నత స్థాయి అధికారులు కేవలం ఐఫోన్లను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, భద్రత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.