దానధర్మాలకు ప్రతీక రంజాన్

పశ్చిమగోదావరి: దానధర్మాలకు ప్రతీక రంజాన్ మాసమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షను పాటించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రంజాన్ మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఇందులో షేక్ రఫాత్, నౌషద్, నరసింహారావు పాల్గొన్నారు.