కలెక్టరేట్‌లో ఏ శాఖకు ఎన్ని వినతులు అంటే..?

VZM: కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ అంబేద్కర్, అధికారులు వినతులు స్వీకరించారు. రెవిన్యూ శాఖకు అత్యధికంగా 68 వినతులు అందగా పంచాయతీశాఖకు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డిఏకు 40 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 07, విద్యా శాఖకు 12, హౌసింగ్‌కు 02, వైద్య శాఖకు 05, విద్యుత్ శాఖకు 07 అందాయన్నారు.