అచ్చంపేట నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు
NGKL: అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లేందుకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పీ. ప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని అయ్యప్ప స్వాములను కలిసి ఆయన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ.. సురక్షితమైన, సుఖవంతమైన, తక్కువ ఖర్చులతో కూడిన ఆర్టీసీ బస్సులోనే యాత్రకు వెళ్లాలని ఆయన సూచించారు.