ఎస్సై ఆధ్వర్యంలో నాకాబందీ

NRML: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిప్నెల్లి గ్రామం వద్ద ఎస్సై జుబేర్ ఆధ్వర్యంలో నాకా బందీ నిర్వహించారు. ఈ సందర్భంగా 36 ద్విచక్ర వాహనాలు,4 కార్లు,8 ఆటోలను తనిఖీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నాకా బందీ చేపట్టడం జరిగిందని ఎస్సై తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.