గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి

గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి

VKB: బంట్వారం మండలం ప్రియాంక HP గ్యాస్ ఏజెన్సీవారు వినియోగదారులకు ముఖ్య సూచనలు జారీ చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మీ బుకింగ్ OTP చెప్పండని ఎవరైనా అడిగితే నమ్మవద్దని సూచించారు. OTP వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌లో ఎవరికీ చెప్పకూడదని కోరారు. సిలిండర్ డెలివరీ సమయంలో మాత్రమే డెలివరీ బాయ్‌లకు OTP తెలపాలని సూచించారు.