పోతిరెడ్డిపాలెం రీచ్‌లో ఇసుక అక్రమాలు

పోతిరెడ్డిపాలెం రీచ్‌లో ఇసుక అక్రమాలు

నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం రీచ్‌లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పడవల ద్వారా కాకుండా, నేరుగా టిప్పర్లతో నదిలో నుంచే ఇసుకను లోడ్ చేస్తున్నారు. రాజకీయ అండదండలతో బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.