గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా దేశాల్లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరి కొన్ని గంటల్లో తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. వెంటే ఆయా చమురు క్షేత్రాల్లో పని చేసే ఉద్యోగులు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. తమ దేశంలోని అతి పెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ పౌర్స్‌పై దాడికి ప్రతిగా దాడులు చేయనున్నట్లు తెలిపింది.