'ఒక్క రోజులో 11,388 కేసుల పరిష్కారం'

'ఒక్క రోజులో 11,388 కేసుల పరిష్కారం'

GNTR: జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 11,388 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టులో 16 బెంచీలు, 12 మండల కేంద్రాలలో 25 బెంచీలను ఏర్పాటు చేసి రాజీకి అవకాశం ఉన్న కేసులతోపాటు ముందస్తు వివాదాలకు సంబంధించిన 908 సివిల్, 10,480 క్రిమినల్ కేసులు పరిష్కారం అయినట్లు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.