ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు

ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 24.38 శాతం పోలింగ్ నమోదైంది. దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మర్కూక్, ములుగు, రాయపోలు, వర్గల్ మండలాల్లో పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.