భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు మరోదెబ్బ

పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే అన్ని రకాల దిగుమతులను కేంద్రం నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2023 నాటి వాణిజ్య విధానంలో కేంద్రం ఓ ప్రత్యేకమైన నిబంధనను చేర్చింది. దీని ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది.