'శ్రీనివాస మంగాపురం' నుంచి స్పెషల్ వీడియో
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఇవాళ రాషా బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెప్పారు. అలాగే స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.