రైతుకు బకాయి చెల్లించని వ్యాపారులపై కేసు

రైతుకు బకాయి చెల్లించని వ్యాపారులపై కేసు

WGL: ఖమ్మంకు చెందిన రైతు ఉపేందర్ రావు ఫిర్యాదు మేరకు అడతీ వ్యాపారి, గుమాస్తాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నవంబరులో 27.65 క్వింటాళ్ల పత్తిని ఆయన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించగా, పాత అప్పు పోను రావాల్సిన రూ.53,500 చెల్లించకుండా నిందితులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు.