బాలుడిపై వీధి కుక్కలు దాడి
TG: వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాలలోని లక్ష్మీ నగర్ లో ఎన్నం సతీష్ కుమారుడు హర్షవర్ధన్ ఇంటి బయట ఆడుకుంటుండగా సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.