'ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు'

'ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు'

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని పలు కిరాణా దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యావరణానికి హానికరమైన నిషేధిత ప్లాస్టిక్ కవర్‌లు ఉపయోగిస్తున్న రాజేశ్వరి అనే కిరాణా దుకాణం యజమానికి రూ.4000 జరిమానా విధించారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.