బాసర ట్రిపుల్ IT విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ IT విద్యార్థుల ఆందోళన

NRML: బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆసుపత్రి నిర్లక్ష్యం, తగిన వైద్య సదుపాయాల లేమి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యార్ధులు ఏబీ3 భవనంలోని వీసీ చాంబర్ వద్ద నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.