ఈ నెల 28న దివ్యాంగులకు క్రీడా పోటీలు

ఈ నెల 28న దివ్యాంగులకు క్రీడా పోటీలు

PDPL: నవంబర్ 28న దివ్యాంగులకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల మధ్య దివ్యాంగులకు పరుగు పందెం, షాట్పుట్, చెస్, జావెలిన్ త్రో, క్యారమ్స్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సముదాయం గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో ఆసక్తిగల వారు పాల్గొనాలన్నారు.