అమరవీరుల త్యాగాలను మరచిపోకూడదు: సీపీ
HYD: అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోకూడదని ఆయన అన్నారు. యుద్ధాలలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాలను మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.