అమెరికా ప్రజలకు ఇరాన్ బహిరంగ లేఖ

అమెరికా ప్రజలకు ఇరాన్ బహిరంగ లేఖ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు అమెరికా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తున్న దాడులను ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు.  'అమెరికా ఫస్ట్' అనేది ప్రస్తుత పరిపాలనలో ఉందా అని ఆయన ప్రశ్నించారు.