MPP పాఠశాలను తనిఖీ చేసిన MEO

ప్రకాశం: కొమరోలు మండలంలోని హనుమంతరాయునిపల్లె MPP పాఠశాలను ఎంఈవో కె. వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీశారు. MEO విద్యార్థులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం రూ. కోట్ల విలువైన పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వీటిని వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని వారికి సూచించారు.