కారు బోల్తా.. కాంగ్రెస్ యువ నేతకు గాయాలు
VKB: యాలాల మండల కేంద్రం సమీపంలోని నాగసముందర్ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ యువ నాయకుడు వికాష్ జోషి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వికాష్ జోషి, ఆయన సతీమణికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.