యాచకులకు నిలయంగా మారిన బస్సు షెల్టర్

అన్నమయ్య: చిట్వేలులోని ఆర్టీసీ బస్సు షెల్టర్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత కొంతకాలం నుంచి నిరుపయోగంగా మారడంతో యాచుకులకు నిలయంగా మారిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి, బస్సు షెల్టర్ ప్రయాణికులకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.