ఎమ్మెల్యేను కలిసిన యెల్లకొండ ప్రజాప్రతినిధులు
VKB: గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యెల్లకొండ ప్రతినిధులు ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఇవాళ కలిశారు. మాజీ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ఎమ్మెల్యేను కలిసి.. పార్వతి పరమేశ్వర దేవస్థానం అభివృద్ధి, గ్రామ సమస్యలపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, త్వరలోనే నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నట్లు వారు తెలిపారు.