పుంగనూరులో ఉచిత వైద్యశిబిరం

CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ ఆవరణం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. మదనపల్లి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు శాశ్వతి, అవినాష్‌లు వివిధ జబ్బులతో శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శివ, సరళ, ముత్యాలు, వరదారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.