రేపు కోలనపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు కోలనపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

W.G: కోలనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో టీఅండ్ పనుల్లో భాగంగా నూతన విద్యుత్ లైన్‌ల నిర్మాణం నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోలనపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.