'ఈనెల 15న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర'
KKD: ఈనెల 15న జిల్లాలో 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశుభ్రత, ప్రజా పరిశుభ్రత, పౌరుల భాగస్వామ్యం విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను జిల్లా అంతటా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.