అక్రమ ఇసుక రవాణాపై ఆకేరు వాగులో తనిఖీలు
HNK: ఐనవోలు మండలం నందనం ఆకేరు వాగులో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న సమాచారం మేరకు సోమవారం మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ మామునూరు వెంకటేష్, పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. రాజగోపాల్, తాహసీల్దార్ విక్రమ్ కుమార్, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.