శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి బ్రహ్మోత్సవాలు
AP: శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో ఈవో శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. భక్తుల క్యూలైన్లు, తాగునీరు, పారిశుధ్యం, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రోజు ప్రభోత్సవం, పాగాలంకరణ, కల్యాణం జరగనుంది.