ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీంకు సర్టిఫికెట్లు అందజేత
NGKL: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఆరుగురు టీమ్ సభ్యులకు కలెక్టర్ బాధావత్ సంతోష్ గురువారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ చిన్న ఓబులేసు కూడా పాల్గొన్నారు.