బుచ్చిరెడ్డిపాలెంలో కోలాహలంగా ఉగాది వేడుకలు
NLR: బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు గ్రామంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి పాల్గొన్నారు. మామిడి తోరణాలు, ముగ్గుల హరివిల్లుల మధ్య గ్రామీణ వాతావరణంలో కోలాహలం మధ్య ఉగాది వేడుకలను నిర్వహించారు.