భూ వివాదం.. వ్యక్తిపై దాడి
CTR: పుంగనూరు మండల సోన్నేపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్ గాయపడడంతో కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు. భూ వివాదం కారణంగా తనపై దాడి చేశారని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ కోరారు.