శర్వా 'జార్జ్ క్రిష్' మొదటి షెడ్యూల్ ఫిక్స్..!

శర్వా 'జార్జ్ క్రిష్' మొదటి షెడ్యూల్ ఫిక్స్..!

శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో 'జార్జ్ క్రిష్' మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పలు రూమర్స్ రాగా.. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి షెడ్యూల్‌లోనే హీరో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఈ మూవీ కోసం శర్వా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.