20న కాశీబుగ్గలో మెగా జాబ్ మేళా
SKLM: ఈనెల 20న కాశీబుగ్గలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ సోమవారం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని ఆయన తెలియజేశారు. 600 మంది నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు.