రైతులెవరు చింతించవద్దు: రవీంద్ర

VZM: ఎస్ కోట మండల వ్యవసాయ శాఖాధికారి రవీంద్ర మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రంలో యూరియా పుష్కలంగా ఉందని రైతులెవరు చింతించవద్దని తెలియజేశారు. యూరియా కావలసిన రైతులు వారి పట్టాదారు పాసు పుస్తకం కానీ, వన్ బి కాపీ గాని తీసుకొని రైతు సేవా కేంద్రానికి వస్తే యూరియా ఇస్తామని తెలిపారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.