BREAKING: కేంద్ర మాజీమంత్రి మృతి

BREAKING: కేంద్ర మాజీమంత్రి మృతి

కేంద్ర మాజీమంత్రి కేపీ ఉన్నికృష్ణన్ మృతి చెందారు. ఈ విషయాన్ని కేరళ కోజికోడ్‌లోని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1971 నుంచి 1996 వరకు వరుసగా ఆరుసార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్, షిప్పింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.