న్యాయం చేయాలంటూ.. పోలీసులకు రాఖీ..!

NLG: రాఖీ పండుగ వేళ నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ నకిరేకల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి డ్యూటీలో ఉన్న సిబ్బందికి రాఖీ కట్టింది. తాటికల్లు గ్రామంలోని బాట పంచాయితీ వివాదంలో తన భర్త ముచ్చపోతుల వెంకన్నపై జంజిరాల వెంకటయ్య కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సోదరభావంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు రాఖీ కట్టి వేడుకుంది.