సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

ADB: ఆదివాసి, గిరిజనుల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆదివాసి గిరిజన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.