'రైతులకు అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'
కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను తొలగిస్తూ, నూతనంగా నిర్మించిన కల్వర్టును, నూతనంగా నిర్మించిన సొసైటీ సమావేశ మందిరంను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో ప్రతి వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు అండగా నిలబడడమే లక్ష్యమని పేర్కొన్నారు.