గృహ నిర్మాణా దరఖాస్తు పొడిగింపు: శ్రీరామ్
సత్యసాయి: పీఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసిన వారికి, ఇంకా దరఖాస్తు చేయని అర్హులైన లబ్ధిదారులకు డిసెంబర్ 14 వరకు గడువు పొడిగించినట్లు శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఇవాళ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధిలోని సచివాలయాల్లో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.