కలెక్టర్ కార్యాలయంలో అబుల్ కలాం జయంతి వేడుకలు
JN: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి విక్రమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.