గ్రామంలో చెత్తను తొలగించిన గ్రామస్తులు
ASR: పాడేరులోని రింతాడ పంచాయతీ డి.పెద్దపాడు గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను గ్రామస్తులు తొలగించారు. ఈ కార్యక్రమంలో పెసా సెక్రెటరీ పాంగీ కృష్ణ పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదేనని పేర్కొన్నారు.