తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనుల పరిశీలన

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని ధర్మవరం గేట్ వద్ద జరుగుతున్న తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు కమిషనర్ ఆదేశించారు.