దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: శంకర్ నాయక్
NLG: దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాలు విసిరారు. నల్గొండలోని మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయకుండా కేసీఆర్ వివక్షత చూపించారని విమర్శించారు.