రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ట్రంప్ వెనకడుగు

రష్యా, ఉక్రెయిన్‌కు US అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రెండు వారాల్లో యుద్ధంపై నిర్ణయం తీసుకోకపోతే భారీ ఆంక్షలు లేదా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. మరోవైపు పుతిన్, జెలెన్‌స్కీ మధ్య భేటీ కష్టమైన పని అని అన్నారు. వాళ్లు కలిసి ముందుకు సాగుతారని అనుకోవడం లేదంటూ తేల్చి చెప్పారు. కాగా, తాను US అధ్యక్షుడినైతే ఇరు దేశాల మధ్య యుద్దాన్ని ఆపుతానని ట్రంప్ ప్రకటించారు.