'బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'
MDK: పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం బాలల హక్కులు, సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ముఖ్య అధికారులు హాజరయ్యారు. బాలల హక్కుల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.